తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 16 2024, 10:00

రెండేళ్ల చిన్నారి ప్రాణం తీసిన స్కూల్ బస్సు

స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

మద్దుట్ల గ్రామానికి చెందిన ఎండి ఆలిఫా అనే రెండేళ్ల చిన్నారి సోదరుడు పాఠశా లకు వెళ్తూ స్కూల్ బస్సులో కూర్చుకున్నాడు.

తన సోదరునితో వెళ్లాలని ఆ చిన్నారి బస్సు ముందు కు వెళ్లింది. ఇది గమనించని డ్రైవర్ స్కూల్ బస్సు ముందుకు పోనించాడు. ఆలిఫా తలపై టైరు ఎక్కడంతో తలకు తీవ్ర గాయమై మరణించింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 16 2024, 09:58

ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సీఎస్‌ల కీలక సమావేశం

లోక్ సభ ఎన్నికల నేప థ్యంలో నిర్వహణపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు.

హైదరాబాద్‌‌లోని సచివా లయంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిలు సమావేశ మయ్యారు. ఎన్నికల నేప థ్యంలో మరింత సమన్వ యంతో పని చేయాలని ఇరువురు సీఎస్‌లు నిర్ణయించారు.

సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమన్వయ భేటీలు జరిగినట్లు అధికా రులు వెల్లడించారు. పోలింగ్ ముగిసే వరకు పకడ్బందీగా వ్యవహరిం చాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అక్రమ మద్యం, డ్రగ్స్‌ రాకుండా సరిహద్దుల్లో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గోవా, కర్ణాటక నుంచి మద్యం రాకుండా సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్రమ మద్యం, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువుల రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు.

శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఇదే వాతావరణాన్ని పోలిం గ్ వరకు పకడ్బందీగా కొనసాగించేందుకు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం దోహదపడుతుందన్నారు.

తెలంగాణ తరఫున పోలీస్ శాఖ ద్వారా 36 అంతరాష్ట్ర చెక్‌పోస్టులు, ఆటవీ శాఖకు సంబంధించి మూడు అంత రాష్ట్ర చెక్‌పోస్టులు, ఎక్సైజ్‌ శాఖ ఎనిమిది, 224 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు, వాణిజ్యపన్నుల శాఖ ద్వారా ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పటిష్టమైన గస్తీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సీఎస్ తెలిపారు.

తెలంగాణలో తీవ్రవాద ప్రాబల్యం లేదని, ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు జరుగ కుండా ఇరురాష్ట్రాలు పోలీసులు, కేంద్ర బలగాలు పటిష్టమైన సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ…

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నం దున ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేం దుకు పూర్తిస్థాయి సమన్వ యంతో కృషి చేస్తున్నామ న్నారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 15 2024, 10:23

బీజాపూర్ ఎన్ కౌంటర్లకు నిరసనగా బందుకు పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ

ఛత్తీస్‌గడ్: మావోయిస్ట్ పార్టీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. బీజాపూర్ జిల్లా ఎన్ కౌంటర్లకు నిరసనగా సెంట్రల్ రీజియన్ బంద్‌ నిర్వహించతలపెట్టింది..

తెలంగాణ, ఏపీ, ఒడిషా, ఛత్తీస్‌గడ్ (Chattisgarh), మహారాష్ట్ర పరిధిలో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలో హై అలర్ట్‌కు పోలీసులు (Police) పిలుపునిచ్చారు. మావోయిస్ట్‌ల ఏరివేత టార్గెట్‌గా భారీగా భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల వేళ కాల్పుల మోతతో ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ దద్దరిల్లింది. వరుస ఎన్‌కౌంటర్లతో విలవిల్లాడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో సెంట్రల్ రీజియన్ బంద్‌కు పిలుపునిచ్చింది.

తెలంగాణ.. ఛత్తీస్‌గడ్ (Chattisgarh) సరిహద్దు దండ కారణ్యం యుద్ధ భూమిగా మారింది. ఒక ఎన్‌కౌంటర్ మరువక ముందే మరో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. పెద్దగా కాలవ్యవధి కూడా లేకుండానే దండకారణ్యంలో తుపాకుల మోత మోగుతోంది. మొన్నటికి మొన్న ఛత్తీ్స్‌గడ్ దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మరువక ముందే మరో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్... ములుగు జిల్లా సరిహద్దు కర్రి గుట్టల వద్ద భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీస్ (Police) బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్‌లు మృతి చెందారు. ఈ క్రమంలోనే ఏకే 47.. లైట్ మెషీన్ గన్,12 బోర్ తుపాకులను సోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని ధృవీకరించారు. తెలంగాణ గ్రే హౌండ్స్... ఛత్తీస్ గడ్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ సరిహద్దులో పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రెండు వారాల వ్యవధిలో మూడు భారీ ఎన్ కౌంటర్స్ జరిగాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ ఎన్ కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్ట్ లు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా కోర్చోలి ఎన్‌కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు.. ఇవాళ సరిహద్దు కర్రిగుట్టల వద్ద ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్ట్ లు మృతి చెందారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 15 2024, 10:21

నేటి నుంచి మళ్ళీ జగన్ మేమంతా సిద్ధం యాత్ర

దాడి ఘటన తర్వాత కోలుకున్న సీఎం జగన్ నేటి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొన సాగించనున్నారు.

మొన్న కేసరపల్లి దగ్గర నిలిచిపోయిన యాత్రను.. ఈరోజు అక్కడి నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. కాసేపట్లో ప్రారంభంకానున్న జగన్ యాత్ర గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్ట గుంట మీదుగా యాత్ర కొనసాగనుంది.

మధ్యాహ్నం జొన్నపాడు దగ్గర భోజన విరామం తీసుకోనున్నారు. అనం తరం మధ్యాహ్నం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల లోకి ప్రవేశించనుంది.

సాయంత్రం గుడివాడలో భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించ నున్నారు.....

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 15 2024, 10:20

నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు.

ఏపీలో అధికారమే లక్ష్యం గా చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటించను న్నారు.

ముందుగా విశాఖ నుంచి మధ్యాహ్నం 3గంటలకు చంద్రబాబు హెలికాఫ్టర్‌లో రాజాం నియోజకవర్గానికి చేరుకుంటున్నారు.

అనంతరం పాలకొండ, పలాస రోడ్‌షోల్లో చంద్ర బాబు ప్రసంగించనున్నారు. పలాస టీడీపీ కార్యాల యంలోనే చంద్రబాబు రాత్రికి బస చేయనున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 15 2024, 09:32

కారు, ట్రక్కు ఢీ కొని ఏడుగురు సజీవ దహనం

కారు, ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాజస్థాన్‌ సికార్‌ జిల్లా ఫతేపూర్‌ షెకావతి లోని ఓ వంతెనపై ఆదివా రం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది.

కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు ఉన్నారు. సమా చారం మేరకు.. వంతెనపై ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారులో మంట లు చెలరేగాయి.

మంటలు చెలరేగడంతో కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగడంతో కారులో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాంప్రతాప్ బిష్ణోయ్ మాట్లాడుతూ కారులో ఉన్న వారందరూ ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్‌కు చెందిన వారని తెలిపారు.

సలాసర్ బాలాజీ టెంపుల్ నుంచి హిసార్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చాలా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

కారులో ప్రయాణిస్తున్న మృతుల వివరాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫతే పూర్ షెకావతి పోలీసులు మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 13 2024, 11:41

వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ, స్పాట్లోనే ఇద్దరు మృతి

హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన గుర్రంగూడ చౌరస్తాలో చోటు చేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.

మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు మీర్‌పేట్‌కు చెందిన బొల్లం ప్రణయ్, వనస్థలిపురంకు చెందిన కుంచల రవిగా గుర్తించారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కాగా..

హయత్ నగర్ నుంచి మాదాపూర్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం వారు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ప్రమాదంలో రెండు కార్లు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి.

వాహనాల పరిస్థితి చూస్తేనే ప్రమాద తీవ్రత అర్ధమవుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 07 2024, 12:17

అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేప థ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.

సాయంత్రం 3.30 గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లి డైట్‌ కళాశాల సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్‌ లో ఏర్పాటుచేసిన హెలీ ప్యాడ్‌కు చేరుకుంటారు.

అక్కడ నుంచి రింగ్‌రోడ్డులో గల ఎన్టీఆర్‌ విగ్రహం కూడలి, చేపలబజారు, చిన్న నాలుగురోడ్ల కూడలి, కన్యకాపరమేశ్వరి జంక్షన్‌, వేల్పుల వీధి మీదుగా నెహ్రూచౌక్‌ జంక్షన్‌ వరకూ వారాహి వాహనంలో రోడ్డుషో నిర్వహిస్తారు.

నాలుగు గంటలకు నెహ్రూచౌక్‌ కూడలిలో వారాహి వాహనం మీద నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించున్నారు

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 07 2024, 12:15

బిడ్డ నీకు...కచ్చితంగా చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా?: సీఎం రేవంత్ రెడ్డి

తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. శనివా రం రాత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ నేతలు నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి మాట్లాడే భాష ఇదేనా అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. 

అడవి పందిలా పదేళ్ల పాటు తెలంగాణను సర్వనాశనం చేశారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేశారు. మీ కాలు విరిగిందని, మీ కూతురు జైలుకి పోయిందని కొంతకా లం మేము సంయమనం పాటించా. అలా అని.. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకో వడానికి నేను జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని అని గుర్తు పెట్టుకో బిడ్డా. మా కార్యకర్తలతో జాగ్రత్త” అంటూ చెలరేగి పోయారు సీఎం రేవంత్ రెడ్డి.

నీ లత్కోర్ మాటలకు చర్ల పల్లి జైల్లో చిప్పకూడు తిని పిస్తా. నువ్వు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టివ్వలేదు. నేను మాత్రం నీకు తప్పకుండా చర్లపల్లి జైల్లో డబుల్ డెబ్ రూమ్ ఇల్లు కట్టిస్తా. బిడ్డా.. నీ కొడుకు, కూతురు, అల్లుడు, నువ్వు.. అందరూ కలిసి ఉండేలా జైల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా” అని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.

నాడు.. బీఆర్ఎస్ ను తొక్కి నట్లే.. బీజేపీని కూడా తుక్కు తుక్కుగా తొక్కు దాం. కార్యకర్తల రక్త త్యాగంతో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడింది. గుజరాత్ మోడల్ కాదు.. ఇక వైబ్రెంట్ తెలంగాణ. 700 మంది రైతులను చంపినందుకు మోడీకి ఓటేయాలా..?

దేశాన్ని విభజన చేసే కుట్ర చేస్తున్నందుకు మోడీకి ఓటేయాలా..? నమో అంటే.. నమ్మితే మోసం. పదేళ్లైనా విభజన హామీలు అమలు చేయనందుకు బీజేపీకి ఓటేయాలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు..

మా 100 రోజుల పాలన చూసి 14 సీట్లలో గెలిపిం చండి. రాహుల్ ప్రధాని కావాలంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించాలి.

దేశం మొత్తం పాదయాత్ర చేసి.. ప్రజల బాధలు తెలి సిన రాహుల్.. విమానాల్లో తిరుగుతూ.. పూటకో డ్రస్ మార్చే మోడీ కాదు. నరేంద్ర మోడీ పరివార్.. ఈడీ, సీబీఐ. మాది దేశం కోసం త్యాగం చేసిన గాంధీ పరివార్.

ఈ ఎన్నికలు మోడీ పరి వార్, గాంధీ పరివార్ మధ్య. తెలంగాణ సమాజానికి గాంధీ కుటుం బం అండగా ఉంటుంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 07 2024, 12:13

ములుగు జిల్లాలో అడవికి అంటుకున్న కార్చిచ్చు: వందల ఎకరాల్లో అడవి దగ్ధం

ములుగు జిల్లాలోని పస్రా తాడ్వాయి అటవీ ప్రాంతం లో కార్చిచ్చురగులుకుంది. ఆదివారం ఉదయం సంభ వించిన అగ్ని ప్రమాదంలో వందలాది ఎకరాల్లో అటవీ ప్రాంతం దగ్ధమవుతున్నది.

ప్రాణ భయంతో వన్య ప్రాణులు పరుగులు తీశాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

భారీగా పొగ మంచు కమ్ము కోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...